ఎన్ సీసీఎస్ లో టెక్నికల్ పోస్టులు.. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక 

ఎన్ సీసీఎస్ లో టెక్నికల్ పోస్టులు.. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక 

నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (ఎన్​సీసీఎస్) జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్- ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఏప్రిల్ 7న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 

ఖాళీలు: 06. 

విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్ – I 2, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ –II (నాన్ మెడికల్) 1, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ –III 2, జూనియర్ రీసెర్చ్ ఫెలో 1.  

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంవీఎస్ సీ, బి.టెక్/ బీఈ, బి.ఫార్మా, బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.  

గరిష్ట వయోపరిమితి: 28 నుంచి 50 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 14. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.nccs.res.in వెబ్ సైట్ ను సందర్శించండి.